NEW ENLGISH WORD : Phubbing అంటే?

Phubbing అంటే?

phub (ఫబ్), phubbing (ఫబ్బింగ్)….ఈ పదాలు మీరెప్పుడైనా విన్నారా, వాడారా?
ఏంటీ, విన్లేదా?
అయితే మీ ఒక్క నిమిషం మాకివ్వండి, ఒక ఇంట్రస్టింగ్ పదం గురించి తెలుసుకోండి.

చేతిలో ఉన్న ఫోన్ లో పూర్తిగా మునిగిపోయి, పక్కన ఉన్న మనుషుల్ని పట్టించుకోకపోవడాన్ని, వాళ్ళతో మాట్లాడకపోవడాన్ని ఫబ్బింగ్ ( phubbing) అంటారు. ఒళ్ళు మండిపోయే పని కదా?

ఈ పదం ఇంగ్లిష్ లోకి కొత్తగాఎంటరైన పదం. కొత్తదంటే మరీ కొత్తదేం కాదు. 2012 లో దీన్ని సృష్టించారు.

PHUB = PHone + snUB

‘phone’ లోని ‘ph’ …..’Snub’ లోని ‘ub’ కలిసి phub అయ్యింది.

కాలం మారుతుంది, దాంతోపాటే మనుషుల అలవాట్లు కూడా. మరి కొత్త అలవాట్లకు కొత్త పదాలు కూడా కావాలిగా.

అన్నట్లు, మీకూ ఫబ్బింగ్ చేసే అలవాటుందా? కొంపదీసి phubbing చేస్తూ ఈ ఆర్టికల్ చదువుతున్నారా? Very bad😢

Please don’t phub! – Stop phubbing!