TED Talks : ఒక్క దెబ్బ, రెండు పిట్టలు

 

screenshot_20161223-072633

Learning English Through TED Talks: పార్ట్-II

టెడ్ వీడియోస్ చూడ్డం స్టార్ట్ చేసారా? మీ అన్సర్ YES అయితే, సంతోషం. ప్లీజ్, కీప్ వాచింగ్!

లేదు, ఇంకా స్టార్ట్ చెయ్యలేదా? అయ్యో, అయ్యో…. స్టార్ట్ చెయ్యండి, వెంటనే.. మనకు అస్సలు పనికిరాని, కేవలం టైంపాస్, ఎంటర్ టైన్మెంట్ వీడియోస్ కంటే ఇవి చాలా ఉపయోగకరం.
టెడ్ టాక్స్ చూస్తే మీరు ఇంగ్లిష్ కి బాగా ఎక్స్పోజ్ అవుతారు + ఈ టెడ్ talks చాలా విజ్ఞానాన్ని కూడా ఇస్తాయి. ONE SHOT – TWO BIRDS,  కదా? అందుకే, TED talks చూడడం మొదలుపెట్టండి.

A ) టెడ్ టాక్స్ YOUTUBE లో చూడాలనుకుంటే……….

1.www.youtube.com వెళ్ళి – ‘TED Videos’ అని వెతకండి.

2.మీకు ప్రత్యేకంగా ఏదైనా సబ్జెక్టు పట్ల ఇంట్రెస్ట్ ఉంటె, ఆ సబ్జెక్ట్ లోని TED Talks కోసం వెదకండి.

ఉదాహరణకు,
– TED videos on learning English/ self confidence/ motivation/

– TED talks on leadership/ Education / Physics/ Computer Science/ History etc.

– TED videos for managers/ students/ kids,/ women, etc

– Best TED talks by Indians

– Most watched TED talks ever

– The 20 most watched TED talks    అలా, మీకెలా ఇష్టమైతే అలా వెతకండి.

౩. మీకు తారసపడ్డ ఒక interesting TED వీడియో ఎంచుకొని వినండి/చూడండి. ఒక్కసారి కాదు, ఒకే ప్రసంగాన్ని మళ్ళి మళ్లి చూడండి. మొదటిసారి, కేవలం అర్థం చేసుకోవడానికి, అర్థమైతే, ఆనందించడానికి; ఆ తరువాత ఆ స్పీచ్ లోని భాషను, ఆ స్పీకర్ శైలిని క్లోజ్ గా అబ్సర్వ్ చేస్తూ మళ్ళీ మళ్ళీ చూడండి /వినండి. ఒక్క వీడియోను పది సార్లు చూసినా పరవాలేదు. It REALLY helps.

B) టెడ్ టాక్స్ TED వాళ్ళ  వెబ్సైట్  TED.COM లో చూడాలనుకుంటే………….

1. www.ted.com కి వెళ్ళండి.

2. ‘Watch’ tab లో TED TALKS సెక్షన్ లో మొత్తం అన్ని టెడ్ టాక్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో/వివిధ గ్రూపుల్లో విభజించబడి ఉంటాయి. కొంచెం ఓపికతో చూస్తే మీకు ఇష్టమైన టాపిక్ మీద టెడ్ వీడియోస్ దొరుకుతాయి.

3. www.ted.com తో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే,. స్పీచ్ కొంచెం కింద ‘interactive transcript’ అన్న లింక్ ను నొక్కితే ‘ప్రసంగ పాఠం’ అంటే స్పీచ్ మీకు అక్షరాల్లో కనిపిస్తుంది. స్పీచ్ చదువుతూ వినొచ్చు లేదా వింటూ చదవచ్చు. ( రెండూ ఒకటే అంటారా!? అయితే ఒకే ☺ )

4. ఇంకో శుభవార్త,……….. TED సంస్థ చేస్తున్న మరో మహోత్తర కార్యం ఏంటంటే, ఈ ప్రసంగాలను ప్రపంచం లోని దాదాపు 112 భాషల్లోకి translate చేస్తుండడం. అందులో, తెలుగు కూడా ఉంది కాబట్టి అది మనకు ఖచ్చితంగా శుభవార్తే.

5. www.ted.com లో ‘Watch’ tab కింద TED TALKS సెక్షన్ లో ఉన్న languages ఆప్షన్ దగ్గర తెలుగు ఎంచుకోండి. ప్రస్తుతానికైతే కేవలం 36 టెడ్ ప్రసంగాలు మాత్రమె తెలుగు అనువాదం తో అందుబాటులో ఉన్నాయి. ప్రసంగం ఇంగ్లీష్ లోనే ఉన్నా దాని అనువాదం కింద తెలుగులో ఉంటుంది. ఇంగ్లిష్ ఎక్కువగా వినడం అలవాటు లేని వాళ్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది.

మరెందుకు ఆలస్యం. రోజుకో 20 నిమిషాలు కేటాయిస్తే చాలు. అయితే ఒక్క విషయం.. మరొక్కసారి చెప్తున్నాం. Repetition is the key to success. ఒక్క వీడియోను తీసుకోండి. దాన్నే చాలా సార్లు చూడండి. అనుభవంతో చెప్తున్నా….”ఇంగ్లిష్ నేర్చుకోవడానికి టెడ్ వీడియోస్ చాలా useful గురూ!”

సో, watch TED videos and learn English!

Happy Learning!
మీ ఇంగ్లిష్ బడి

ఫేస్బుక్ పేజ్ :  https://www.facebook.com/myenglishbadi/
    (PLEASE LIKE the page for more updates)

వెబ్సైట్:  (PLEASE VISIT regularly): https://englishbadi.com/

2 Comments

  1. Yeah sir.thank you very much.its very useful…

Comments are closed.