ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే, ఏదైనా స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావడం తప్పనిసరా?


52716మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడ్డం వస్తే మీ విజయావకాశాలు ఎక్కువ అవుతాయని మీరు అర్థం చేసుకున్నారు. సంతోషం. Congratulations and all the best.

థాంక్స్,  కానీ……… ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏదైనా స్పోకెన్ ఇంగీష్ ఇన్స్టిట్యూట్ కి తప్పనిసరిగా వెళ్ళాలా అని అడుగుతున్నారా?  ఐతే  ఇది చదవండి.

ఖచ్చితంగా ఏదో ఒక స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తే ‘మాత్రమె ‘ ఇంగ్లిష్ వస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎలా నేర్చుకోవాలో తెలిసి, మీ పట్టుదలకు, కొంచెం మోటివేషన్ను కలిపి, శ్రద్ధగా, క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే, ఎక్కడికి వెళ్ళకుండానే ఇంగ్లిష్ లో చక్కగా మాట్లాడ్డం నేర్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్న వాళ్ళందరూ జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా?

అయితే, ఏదైనా ఇన్స్టిట్యూట్ కి వెళ్ళే సమయం మీకుండి, కోర్సు ఫీజ్ కు కావాల్సిన డబ్బులు మీకు ప్రాబ్లం కాకపొతే ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని ఎంచుకొని రెగ్యులర్ అటెండ్ అవుతూ మీరు ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. మీలాంటి వాళ్ళు, ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న తపన ఉన్నవాళ్ళే ఈ కోర్స్ లకు వస్తారు కాబట్టి మీ క్లాస్మేట్స్ మీ ఇంగ్లిష్ ప్రాక్టీసు లో బాగా ఉపయోగపడుతారు.

అయితే, స్పోకెన్ ఇంగీష్ టీచర్ ను, ఇన్స్టిట్యూట్ ను, ఎంచుకోవడంలో కొంచెం జాగ్రత్త వహించండి. ప్రకటనలను, ఫాల్స్  ప్రామిస్ లను చూసి మోసపోకండి. గుర్తుంచుకోండి… ఒక భాష నేర్చుకోవడం కొన్ని గంటల్లోనో, మున్నాలుగు వారాళ్లోనో జరిగే పని కాదు. ఇట్ టేక్స్ టైం. అలాగే,  ఏ లాంగ్వేజ్ లెర్నింగ్ క్లాసు లో అయినా టీచర్ తక్కువగా మాట్లాడాలి, స్టూడెంట్స్ కి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉండాలి. టీచర్ ఎంత సేపటికి గ్రామర్ కాన్సెప్ట్స్ చెప్పడం మాత్రమే చేస్తే మీరు ఇంగ్లిష్ గ్రామర్ లో perfect అవుతారేమో గాని, ఇంగ్లిష్ లో మాట్లాడడం మాత్రం రాదు. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ ల  వలన కలిగే లాభం చాలా తక్కువ.

కాబట్టి, ఒక ఇన్స్టిట్యూట్ జాయిన్ కావడానికి ముందు, దాన్ని గూర్చికొంచెం రిసెర్చ్ చెయ్యండి.  ఇంతకుముందు ఆ ఇన్స్టిట్యూట్లో చదివినవాల్లని కలిసి ఆ ఇన్స్టిట్యూట్ గూర్చి & టీచర్ గురించి తెలుసుకోండి.

  • క్లాస్ లో ఎంత మంది స్టూడెంట్స్ ఉంటారు?
  • అసలు ఆ టీచర్/ టీచర్స్ ఎంత చక్కగా ఇంగ్లిష్ మాట్లాడతారు?
  • ఆ ఇన్స్టిట్యుట్ లో స్టూడెంట్స్ తో మాట్లాడిస్తారా లేదా?
  • స్టూడెంట్స్ మాట్లాడిన తరువాత క్వాలిటీ ఫీడ్ బ్యాక్ ఇస్తారా లేదా?

అన్న విషయాలు తెలుసుకోండి. అన్నీ పాజిటివ్ గా ఉంటేనే జాయిన్ అవ్వండి. లేకపోతె డబ్బులు వృధా, అంతకంటే ముఖ్యంగా సమయం వృధా.

ఒకవేళ ఏదైనా ఇన్స్టిట్యూట్ జాయిన్ అయితే కిందున్నఈ కొన్ని విషయాలు మర్చిపోకండి.

  1. క్లాసెస్ మిస్ చేయకండి.
  2. హోం వర్క్ఇస్తే తప్పకుండా చెయ్యండి.
  3. క్లాస్స్ రూమ్ అక్టివిటిస్ లో చురుకుగా పాల్గొనండి.
  4. కీప్ ఎక్స్పిరిమెంటింగ్.  కమ్యూనికేషన్ స్కిల్స్ పై, మీరు నేర్చుకొనే అనేక విషయాలపై ప్రయోగాలు చెయ్యడానికి మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసు ఒక మంచి వేదిక. ఈ ప్రయోగాలు మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ ని పెంచుతాయి.
  5. క్లాస్ రూంలో మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వెళ్ళండి.

మాట్లాడడానికి భయపడకండి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడి, టీచర్ మరియు మీ క్లాస్మేట్స్ ఇచ్చే ఫీడ్ బ్యాక్ ని ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత తొందరగా మీ ఇంగ్లిష్ నేర్చుకోవాలనే ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. అలా చేయకపోతే, మనం స్కూల్లల్లో & కాలేజీల్లో ఇంగ్లిష్ క్లాసెస్ లో చేసినట్లు – స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసెస్ కూడా వచ్చామా, విన్నామా, వెళ్ళామా అన్నట్టుగానే ఉంటుంది. జాగ్రత్త!

ఏ కారణం చేతనైనా, మీరు స్పోకెన్ ఇంగ్లిష్ ఇన్స్టిట్యూట్ వెళ్ళడం వీలుకాకపోతే, నిరుత్సాహపడకండి. మీరు స్వంతంగానే ఇంగ్లిష్ నేర్చుకోవచ్చు. అలా నేర్చుకొని ఇంగ్లిష్ లో ఆత్మవిశ్వాసంతో, అనర్గళంగా మాట్లాడేవాళ్ళు మనచుట్టూ చాలా మంది ఉన్నారు. Remember, it’s possible and it’s easy.

Once again, all the best!!

 

 

9 Comments

  1. Thanks. I will try to learn English with your inspiration.

  2. Thank you sir it’s really good wt u said

  3. Thanking you sir for your guidance..!

  4. Thank you for your valuable words to us….

  5. Thankq you sir good inspiration words

  6. Author

    Thanks for your message. Please visit englishbadi regularly.

  7. chandraiah.D i would like to learn fluent english so please send me some important modals tips
    my mail id is dandasichandraiah@gmail.com
    my mobil no 9908072327.thanka you sir

Comments are closed.