“KNOW YOUR ENGLISH (by Prof. Upendran S)”

– Cellfish అన్న పదం ఉందా?
– Humongous అన్న పదాన్ని ఎలా పలకాలి?
– ITS కి IT’S కి తేడా ఏంటి?
– ‘Man Friday’ అంటే ఎవరు?

ఇలాంటి ఆసక్తికరమైన, అవసరమైన ప్రశ్నలకి సమాధానం కావాలంటే ‘హిందు’ పేపర్లో ప్రతి సోమవారం “Education Plus” సప్లిమెంట్ లో వచ్చే “KNOW YOUR ENGLISH (by Upendran S)” చదవండి. This is one of the most popular weekly columns in the ‘The Hindu’.

1992 నుండి (25 సంవత్సరాలుగా!) వస్తున్న ఈ శీర్షిక కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఉపెంద్రన్ గారు EFLU – Hyderabad లో ఇంగ్లిష్ ప్రొఫెసర్. EFLU – English and Foreign Languages University (దీన్నే ఇదివరకు సీఫెల్ CIEFL – Central Institute of English and Foreign Languages అనేవారు.)

చాలామందిని సతమత పెడ్తున్న ఇంగ్లిష్ భాష మరియు వాడకానికి సంభందించిన ప్రశ్నలకు ఉపెంద్రన్ గారు సమాధానాలిచ్చే విధానమే ఈ శీర్షిక సక్సెస్ కు ప్రధాన కారణం అని చెప్పొచ్చు. చక్కటి వివరణ తో, సరైన ఉదాహరణలతో, సునిశితమైన హాస్యాన్ని మిళితం చేస్తూ, కావాల్సిన దగ్గర ఆయా పదాల ఉచ్చారణను (pronunciation), వాటి పుట్టుక (etymology)ను తెలియచేస్తూ సాగే ఈ “KNOW YOUR ENGLISH” శీర్షిక ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ column చివర్లో సందోర్భోచితంగా ప్రస్తావించే కొటేషన్ మరో హైలైట్,

చదవడం మొదలు పెట్టండి మీరూ ఫాన్స్ ఐపోతారు.

Thank you, Professor.