అమ్మా నాన్నలకు ప్రేమతో పది మాటలు.

తల్లితండ్రులకు “englishbadi.com” ఓపెన్ లెటర్.

అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ అంటుండేవారు: ప్రపంచంలో మంచి మార్పు తీసుకురావాలంటే ముగ్గురితోనే సాధ్యమవుతుంది. ఆ ముగ్గురు: 1. అమ్మ 2. నాన్న 3. ప్రైమరీ స్కూల్ టీచర్.

మీ ఇంట్లో LKG నుండి ఇంజినీరింగ్ వరకు ఏదో ఒకటి చదువుతున్న విద్యార్థి ఉండి, వాళ్ళు తమ జీవితాల్లో విజయం సాధించాలన్నదే మీ ప్రధాన లక్ష్యం ఐతే, దయచేసి ఒక ఐదు నిమిషాలు కేటాయించి కిందున్న ఈ పది విషయాలు చదవండి, ఆలోచించండి, వీలైతే ఆచరించండి.

ఉపయోగపడుతుందనిపిస్తే ఈ పోస్ట్ ని మీ ఫ్రెండ్స్ కి online లో share చెయ్యండి. Offline లో పోస్ట్ లోని విషయాల్ని పంచుకోండి. 

మీ లోకంలో విద్యార్ధులెవరూ లేరా? ఐతే, ఇది చదవడం మీరిక్కడితో ఆపెయ్యొచ్చు.

1. ఇంజినీరింగ్, మెడిసిన్, MBA, LLB డిగ్రీ ఏదైనా, సర్టిఫికేట్స్ మాత్రమే ఉపాధిని కల్పించలేవు. విజయానికి కావాల్సింది ఆయా రంగాల్లో పరిజ్ఞానం (knowledge), నైపుణ్యం (skills).

2. అందరూ అనుకుంటారు…. మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘నిరుద్యోగం’ అని.  కాని అది నిజం కాదు. మనకున్న అసలు సమస్య ‘నైపుణ్య లేమి’ . మన విద్యార్థుల్లో చాలా మందికి ఉద్యోగాలు చేయడానికి కావాల్సిన skills లేకపోవడమే కలవరపెట్టే విషయం. పెద్దాయన నిజమే చెప్పాడు……….‘Unemployability’ is a bigger crisis than unemployment,’ says Kalam.

3. మన పిల్లలు డిగ్రీలు, పిజీలు చేసి నిరుద్యోగులుగానో, చదివిన చదువుకు సంబంధంలేని పనులు చేసే చిరుద్యోగులుగా మిగిలిపోకూడదనుకుంటే వారి నైపుణ్యాభివ్రుద్దికి.  తద్వారా దేశాభివృద్ధికి మీ సహాయం  కూడా ఎంతో అవసరం. పిల్లలు బాగుపడితే దేశం బాగు పడ్డట్లే, కదా?

4. Skills అంటే కేవలం టెక్నాలజి, ఫిజిక్స్, అకౌంటన్సీ మాత్రమె కాదు. వాటిని మన పిల్లలు స్కూల్లల్లొ, కాలేజీల్లో నేర్చుకుంటున్నారు (అనే అనుకుందాం). కాని వాళ్ళ విజయానికీ అవి మాత్రమే సరిపోవు. మన విద్యార్థుల్లో ఉండాల్సింది మంచి వ్యక్తిత్వ లక్షణాలు (Personality traits/ Soft Skills).

వీటిలో చాలా ముఖ్యమైన skills – “Communication Skills.“

5. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత బాగున్నా, కేవలం కమ్యునికేషన్ స్కిల్స్ బాగా లేకపోవడం వల్ల చాలా మంది అపజయాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకోవడానికి సర్వే లు, NASSCOM రిపోర్టులు ఆవసరం లేదు. సరిగ్గా చూడండి. మీ ఊర్లోనో, కాలనీల్లోనో, మీ బంధువర్గం లోనో ఉంటారిలాంటివాళ్ళు ……..కోకొల్లలు.

6. డిగ్రీ, పిజి అయిపోయిన తరువాత క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లోనో, స్పోకెన్ ఇంగ్లిష్ institutes ల లోనో, ముప్పై రోజుల్లోనో, మూన్నెళ్ళ లోనో వచ్చేవి కాదు – communication skills. పేరులోనే ఉంది….అవి skills..

——Subject  నేర్చుకుంటే వస్తుంది.

—–Skills నేర్చుకోవాలి + ప్రాక్టిస్ చేయాలి. దానికి టైం పడుతుంది.

7. Communication Skills అంటే కేవలం English/Spoken English మాత్రమే కాదు. మొదట మన పిల్లలకు తెలుగులో చక్కగా కమ్యునికేట్ చేయడం రావాలి. తాము అనుకున్నది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరితోనైనా సరళంగా, ధైర్యంగా, మర్యాదతో మాట్లాడడం వాళ్లకు రావాలి…… first of all ,తెలుగులో. మాతృభాషలో మంచి కమ్యునికేషన్ స్కిల్స్ ఉంటే, ఆ తరువాత ఇంగ్లిష్,  హిందీ, స్పానిష్, జర్మన్.. ఏ భాష నేర్చుకుంటే ఆ భాషలో communication skills ఉంటాయి. భాష తెలియడం వేరు, communication skills ఉండటం వేరు. గమనించండి.

అంతా కరెక్టే, కాని మేమేం చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మీరు చెయ్యాల్సింది మూడే పనులు.

1. చదివించండి.

2. చూపించండి.

3. మాట్లాడండి.

8. పిల్లల్లో చదివే అలవాటును ప్రోత్సహించండి. సబ్జెక్ట్ మాత్రమే కాకుండా ఇతర పుస్తకాలు చదివేలా చేయండి. ముఖ్యంగా, చిన్న చిన్న కథలు, కామిక్స్, స్పూర్తిప్రధాతల జీవిత చరిత్రలు, న్యూస్ పేపర్స్, ఏదైనా సరే, తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ ఏ భాషలో ఐనా సరే, చదివేలా చూడండి, please note! Reading is the best habit one can have.

9. పిల్లలు TV లో, Internet లో ఎంతసేపటికీ ఆ entertainment ప్రోగ్రామ్స్ కాకుండా, ఆలోచన రేకెత్తింప చేసే, ఎన్నో విషయాల మీద అవగాహన కల్పించే ప్రోగ్రామ్స్ చూసేలా చూడండి. వాళ్ళు  Edutainment ప్రోగ్రామ్స్ చూసేలా చూడండి. ( Education + Entertainment = Edutainment )

10. పిల్లలతో మాట్లాడండి. వాళ్ళ చేత మాట్లాడించండి. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. మీరేమీ corrections చెయ్యాల్సిన పనిలేదు. అవసరమయినప్పుడ వారి అవగాహనకు, అభిప్రాయాలు ఏర్పడటానికి కావాల్సిన సమాచారాన్ని అందివ్వండి, చాలు. మాట్లాడడం లోని power, బాగా మాట్లాడితే కలిగే ప్రయోజనాలని వాళ్లకు తెలిసేలా చెయ్యండి., చాలు!

ఇక్కడిదాకా చదివారా? చాలా థాంక్స్. పోస్ట్ కొంచెం పెద్దదే అయ్యింది. సాధ్యమయినంత క్లుప్తంగా చెప్పడానికే ప్రయత్నిచాను.

మరిన్ని ఆర్టికల్స్ కోసం englishbadi.com చూడండి.

రెగ్యులర్ updates కోసం FB పేజి www.facebook.com/myenglishbadi ని like చెయ్యండి.

మీ ఫ్రెండ్స్ కి  englishbadi ని పరిచయం చెయ్యండి.

కృతజ్ఞతలు!

Pic : google images

11 Comments

  1. Excellent post

    1. Author

      Thank you! Please visit us regularly and provide us with your valuable feedback.

    2. This is Sabitha sir thank u for this post

      1. Author

        Thanks for visiting EnglishBadi. Please come regularly. Happy learning!

  2. Superb post sir

  3. Please create a English badi application

  4. its good to learn english sir

  5. thank u sir its wonderfull message.

  6. thank u sir ..,

  7. Exlent message

Comments are closed.