ఇంగ్లిష్ నేర్చుకోవడం ఎక్కడ మొదలుపెట్టాలి?

 

start-small

మనలో చాలామందికి, ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు ఇదో పెద్ద సమస్య. నేర్చుకోవాలన్న కోరిక ఉంటుంది కాని ఎక్కడ మొదలుపెట్టాలో అర్ధం కాదు. ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాక అసలు నేర్చుకోవడం మొదలు పెట్టనివాళ్ళు మనలో చాలా మంది ఉన్నారు. స్కూల్లల్లో, కాలేజీల్లో మనం నేర్చుకునే ఫిజిక్స్, కామర్స్, ఎకనామిక్స్ లాంటి సబ్జెక్టులకు ఒక మొదలు, ఏదో ఒక దగ్గర ముగింపు ఉంటాయి కాబట్టి కొంచెం కష్టపడితే ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించడం సులువవుతుంది. కానీ, ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్ కాదు. ఇంగ్లిష్ ఒక స్కిల్.

ఎక్కడ మొదలు పెట్టాలో అని అలోచిస్తూ టైం వేస్ట్ చెయ్యకుండా, ఇప్పుడే, ఇక్కడే మొదలు పెట్టండి.

  • అన్ని లక్ష్యాలను సాధించడానికి కావల్సినట్టుగానే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కూడా చాలా మోటివేషన్ అవసరం. So, be motivated!
  • అందరి సంగతి ఏమో కాని, ‘మీరు ఇంగ్లిష్ ఎందుకు నేర్చుకోవాలనుకంటున్నారో, మీ గోల్ ఏంటో తెలుసుకోండి.
  • మీరు ‘ ఇంగ్లిష్ నేర్చుకోవడం సీరియస్ గా స్టార్ట్ చేసారని, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి అనౌన్స్ చెయ్యండి.
  • మీ డైలీ షెడ్యుల్ లో ఇంగ్లిష్ నేర్చుకోవడానికి కొంత సమయం కేటాయించండి. తక్కువ సమయంతో మొదలుపెట్టి, మెల్లిగా మీ ప్రాక్టిస్ జోరు పెంచండి. అంతేకాని , కొత్తలో చాలా జోష్ చూపించి, ఒక వారం కాగానే. మీ గోల్ ని మర్చిపోకండి. ప్రతీరోజు గంట, లేకపోతే కనీసం అర్థగంట అన్నా ఇంగ్లిష్ కోసం పక్కన పెట్టండి.
  • మీ ఇంగ్లిష్ నోట్స్ రాసుకోవడానికి ఒక పాత డైరీనో, నోట్ బుక్ నో ప్రత్యేకంగా పెట్టుకోండి.
  • రోజూ ‘ఇంగ్లిష్ బడి’ కి రండి.
  • “ఇంగ్లిష్ బడి” లో – ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అన్న బేసిక్ కాన్సెప్ట్స్ వివరిస్తూ ఉన్న చిన్న చిన్న ఆర్టికల్స్ తెలుగులో ఉన్నాయి. కేవలం థియరీ అనుకోకుండా అవన్నీ చదివి అర్థం చేసుకోడానికి ప్రయత్నిచండి. ఈ విషయాలపై క్లారిటి ఉండటం చాలా అవసరం.
  • ఆడుతూ, పాడుతూ నేర్చుకుంటే ఏదైనా సులభంగా నేర్చుకోవచ్చు. టెన్షన్ పెట్టుకోకండి. Have fun while learning English.

ఒక వెయ్యి మైళ్ళ ప్రయాణం ఒక అడుగుతోనే మొదలు అవుతుందని మీకు తెలుసు. ఇదే ఆ మొదటి అడుగు కానివ్వండి.

ఒక్కసారి కమిట్ అయ్యింతరువాత, మీ మాట మీరే వినకండి!!