ఇంగ్లిష్ ‘నేర్చుకొంటే’ పర్సనాలిటీ డెవలప్మెంట్ ‘ఉచితం’ – 3 : గౌర్ గోపాల్ దాస్

 

1995 లో పూణే లో ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి……., HP (Hewlett-Packard Company) కంపెనీ లో కొంత కాలం ఎలక్ట్రికల్ ఇంజినీర్ గా పనిచేసి……. కేవలం టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలు కనుగొనడంతో సంతృప్తి చెందక, సమాజం లోని  చాలా సమస్యలకు పరిష్కారం చూపాలన్న ఉన్నత ఆశయం తో ‘ఎలక్ట్రికల్ ఇంజినీర్’ నుండి ‘లైఫ్ స్టైల్  ఇంజినీర్’ గా మారిన గౌర్ గోపాల్ దాస్ (Gaur Gopal Das) విడియో లు యూట్యూబ్ లో, వాట్సాప్ లో  చాలా పాపులర్.

ఈయన ప్రస్తుతం ముంబై ఇస్కాన్   సంస్థలో యువ సన్యాసి!

By the way, సచిన్ తెందూల్కర్, గౌర్ గోపాల్ దాస్ సమవయస్కులు.

* (ISKCON  = International Society of Krishna Consciousness) 

గౌర్ గోపాల్ దాస్ మంచి పబ్లిక్ స్పీకర్. సీరియస్ విషయాల్ని చిరునవ్వుతో, ఆధ్యాత్మికతను హాస్యంతో కలుపుతూ గోపాల్ దాస్ చేసే ప్రసంగాలు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయి. ఇంకో విషయం, గోపాల్ దాస్ మంచి రచయిత కూడా!!  వీరు రాసిన కొన్ని ఇన్స్పిరేషనల్ పుస్తకాలు – ‘Revival’, ‘Conquest’, ‘Checkmate

ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేస్సుకోవడం తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా మీ లక్ష్యమైతే, గోపాల్ దాస్  విడియోలు మీకు బాగా ఉపయోగపడతాయి. యూట్యూబ్ లో చాలా ఉన్నాయి. మచ్చుకి కొన్ని విడియోల టైటిల్స్  ( యూట్యూబ్ లింక్స్ తో ) కింద ఉన్నాయి.  వీలున్నప్పుడు చూడండి, నచ్చిన విడియోలను ఎక్కువసార్లు చూడండి.

ఆల్ ద బెస్ట్! Happy Learning!!