Help Others Improve English – విద్యా దానం – మహా దానం

 

శ్రీమంతుడు సినిమా పోస్టర్ & బట్టతలా…….కొంచెం సరదా కోసం మాత్రమే. Just for fun!

కాని చెప్పాలనుకుంటుంది మాత్రం సీరియస్సే.

మీరు ఇంగ్లిష్ రెగ్యులర్ గా, బాగామాట్లాడతారా? ఇంగ్లిష్ లో confident గా, clear గా, correct గా మాట్లాడడం ఎంత అవసరమో మీకు తెలుసు, కదా? మీకు English Badi చేసే చిన్న అభ్యర్ధన……..

మీ బంధువర్గంలోనో, మీరుండే కాలనీల్లోనో, మీకు తెలిసినవాళ్లలోనో ఇద్దరు/ముగ్గురు విద్యార్థులను ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకొమ్మని ప్రోత్సహించండి. వాళ్ళు- స్కూల్ పిల్లలైనా పరవాలేదు, ఇంజీనీరింగ్ లేదా రెగ్యులర్ డిగ్రీ స్టూడెంట్స్ అయితే మరీ మంచిది…….. ఇంగ్లిష్ నేర్చుకోవడంలో వాళ్ళకు సహాయపడండి. మీరు లెక్చర్లివ్వాల్సిన పని లేదు. గ్రామర్ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు.

వాళ్ళతో వారానికోసారి ఒక పది/పదిహేను నిమిషాలు ‘ఇంగ్లిష్ లోనే’ మాట్లాడండి, ఫోన్ లో ఐనా సరే.

That will make a lot of difference to the students, to their families and to the COUNTRY.

విద్యా దానం – మహా దానం.