HAPPY NEW YEAR!

నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

అదేంటి, కొత్త సంవత్సరం ఆల్రెడి ఏడు నెలల పాతదైపోయింది…… ‘తెలుగు ఉగాది’ , తమిళ, మళయాళ, బెంగాళీ కొత్త సంవత్సరాలు కూడా అయిపోయాయి….. ఇప్పుడేం నూతన సంవత్సరం అనుకుంటున్నారా?

మేం మాట్లాడుతుంది, కొత్త విద్యా సంవత్సరం గురించి… కొత్త academic year లోకి అడుగు పెడ్తున్న విద్యార్థులందరికి, englishbadi తరపున “నూతన సంవత్సర శుభాకాంక్షలు.”

కొత్తది ఏదైనా సరే, మొదలుపెట్టడం కొంచెం ఎక్సైటింగ్ గానే ఉంటుంది. ఈ సరికొత్త ప్రయాణం మొదలు పెడుతున్న విద్యార్థులకు englishbadi కొన్ని టిప్స్ అందిస్తుంది.    స్టూడెంట్స్ అందరూ, ముఖ్యంగా ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్, లేదా డిగ్రీ కోర్సుల్లోకి వెళ్తున్న విద్యార్ధి మిత్రులందరూ ఒక ఐదు నిమిషాలు వెచ్చించి మా ఈ పది మాటలు చదవండి, ప్లీజ్!

  1. మీ ఇంజినీరింగ్ / డిగ్రీ చదువుల్ని …….సీరియస్ గా చదవకండి. సిన్సియర్ గా చదవండి.
  2. గతంలో మీరేదైనా కావచ్చు. టాప్, తోప్ , డల్, ఆవరేజ్… మీరెలాంటి స్టూడెంట్ అయినా కానివ్వండి. గతంలో జీవించకండి. Below average స్టూడెంట్స్ కూడా కష్టపడి పైకి రావచ్చు. గతంలోని బ్రిలియంట్ స్టూడెంట్స్ గంగ లో కలవచ్చు. ఓడలు, బళ్ళు – బళ్ళు, వొడలు అవుతూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి.
  3. కేవలం అటెండెన్స్ కోసం అటెండ్ కాకండి. Be present completely, మనసా, వాచా, కర్మణా!
  4. మీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటో, షార్ట్ టర్మ్ గోల్ ఏంటో మీకు క్లియర్ గా తెలిస్తే వాటిని సాధించడానికి కావాల్సిన ప్లానింగ్ చెయ్యండి, మెల్లి మెల్లిగా ఆ ప్లాన్ ని అమలు చెయ్యండి..  గోల్స్ లేవా, అయితే వెంటనే లక్ష్యాలను సెట్ చేసుకోండి.
  5. డిగ్రీలు కాదు….. skills (నైపుణ్యం) ముఖ్యం అని గమనించండి. మీ విజయానికి అవసరమైన skills ఏంటో….. మీ దగ్గర ఏం ఉన్నాయో…., ఏం లేవో తెలుసుకోండి. ఈ మూడు/ నాలుగు సంవత్సరాలలో  మీక్కావాల్సిన స్కిల్స్ పెంపొందించుకోవడానికి కష్టపడండి.
  6. ఎక్కువ సమయం లేదు మిత్రులారా, గమనింపుడి…..గంటలు, రోజులు, వారాలు, నెలలు, మూడు సంవత్సరాలు, నాలుగు సంవత్సరాలు … చూస్తుంటే గడిచిపోతాయ్. అదీ, మీరున్న వయసులో…… టైం సూపర్ ఫాస్ట్ గా అయిపోతుంది…. వయసలాంటిది!  So,  రేపటి రోజు మీ టైం బాగుండాలంటే … మీటైంని మీరు  ఇప్పుడు బాగా manage చెయ్యడం నేర్చుకోండి……చెయ్యండి.
  7. ‘Sound mind in sound body’. ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండండి, ఉండడానికి శ్రమించండి.
  8. కొత్త వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడానికి సిగ్గుపడకండి. మీకు మంచి అనిపించే స్నేహాల్ని కొనసాగించండి. చెడుని మొదటే తుంచేయండి. 
  9. చదువన్నాక stress ఉంటుంది. స్ట్రెస్ ను ఎలా manage చెయ్యాలో నేర్చుకోండి. ఫెస్బుకింగ్, చాటింగ్. సినిమాలు, అప్పుడప్పుడు అవుటింగ్ లాంటి  స్ట్రెస్ బస్టర్స్ are totally fine. కాకాపోతే  ఇవన్నీ ‘అతి’ గా చేయడమే ప్రమాదం. “అతి సర్వత్రా వర్జయేత్!” 
  10. చివరిది, www.englishbadi.com ‘ఇంగ్లిష్’ మాట ఎత్తకుండా పోస్ట్ complete చేస్తే బాగుండదు కదా. మీ సక్సెస్ సాధించాలంటే ఇంగ్లిష్లో మాట్లాడడం అవసరం అనుకుంటే, ఇప్పుడే మొదలు పెట్టండి…… ఇంగ్లిష్ చదవడం, వినడం, మాట్లాడడం, ఇంకా రాయడం.

 

డిగ్రీలు, ఇంజినీరింగ్ లు అయిపోయిన తరువాత ఇంగ్లిష్ నేర్చుకోవాలని ప్రయత్నించడం…… చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది. 

So, all the best! Wish you a happy new academic year!

 

Hope this post is of some help to you.

Please VISIT our website regularly www.englishbadi.com

Please LIKE our Facebook Page www.facebook.com/myenglishbadi

Please INTRODUCE us to your friends especially ‘student friends’

Best

English Badi

 

2 Comments

  1. wow your super sir,

    great people think always great..,

    1. Author

      Thanks for you kind words Mr Kiran. Please keep visiting EB.

Comments are closed.