వీలైతే ప్రేమించండి. లేకపోతే, కనీసం….

 

Learn English through grammar

 

ప్రేమికుల దినోత్సవం అయిపొయింది కదా, మళ్లీ ఈ ప్రేమ లొల్లి ఏంటి అనుకుంటున్నారా?

మేం మాట్లాడుతుంది ఇంగ్లిష్ గ్రామర్ గురించి. కారణాలేమైనా కావచ్చు, మనలో చాలా మందికి గ్రామర్ అంటే అసహ్యం, కోపం, చిరాకు, ద్వేషం, అయిష్టం, ఇంకా చాలా చాలా. నిజానికి, ఒక భాష నేర్చుకోవాలంటే, దాని గ్రామర్ ( వ్యాకరణం) పూర్తిగా అవపోసన పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మనకు తెలుగు బాగానే వస్తుంది కాని తెలుగు గ్రామర్ మనకెంతవరకు తెలుసు?!?!

నేర్చుకోవాలనుకున్న భాషను రెగ్యులర్ గా వినడం, చదవడం, అర్ధమైనది అర్ధమైనట్టు మాట్లాడటం, రాయడం ….ఇదీ సహజమైన పద్దతి. కానీ, ఇంగ్లిష్ లో పూర్తిగా మునిగిపోయి దాన్ని నేర్చుకునేంత సమయం, పరిస్థితులు లేవు కాబట్టే, గ్రామర్ నేర్చుకుంటూ ఇంగ్లిష్ పై పట్టు సంపాదించడం తెలివైన మార్గం.

మీరు చక్కగా ఇంగ్లిష్ మాట్లాడడానికి ఉపయోగపడేవిధంగా, కొన్ని గ్రామర్ లెసన్స్ చెప్పాలని ” ఇంగ్లిష్ బడి” అనుకుంటుంది.

దానికి ఉపోద్ఘాతమే ఇది. ఏదన్నా నేర్చుకోవాలంటే, ముందు దాన్ని మనం ప్రేమించాలి, కదా?

సో, వీలైతే ఇంగ్లిష్ గ్రామర్ ని ప్రేమించండి. వీలుకాకపోతే……. దయచేసి, కనీసం ద్వేషించకండి.

Happy Learning!