కొంత మంది ఇంగ్లిష్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారో తెలిస్తే మీరు షాక్ అవుతారు!!!

ఈ ‘షాక్’ స్టేట్మెంట్ just for fun.  చెప్పబోయే విషయం మిమ్మల్ని షాక్ కు గురి చేయకపోవచ్చు కానీ కొంచెం ఇంట్రెస్టింగ్ విషయమే…. చదవండి.

జార్జి బెర్నార్డ్ షా అంటాడు …’Cricket is a game played by 11 fools and watched by 11,000 fools.’  బెర్నార్డ్ షా అన్నది 1950 పూర్వం అయినా,  ప్రేక్షకుల సంఖ్య 11,000 నుండి 11 లక్షలు, కోట్ల వరకు వచ్చినా,…….. క్రికెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇప్పటికే చెప్పే మాట ఇది. క్రికెట్ lazy గేమ్ అని, ఈ ఆట వల్లే మన దేశం లో చాలా ఆటలకు దక్కాల్సిన ప్రాధాన్యత దక్కట్లేదని  క్రికెట్ ద్వేషుల అభిప్రాయం. అయితే వీళ్ళ సంఖ్య తక్కువే.

క్రికెట్ అంటే చెవి కోసుకునే వాళ్ళు, పడి చచ్చేవాళ్ళు,  క్రికెట్ కోసం ఆఫీస్ లు ఎగ్గొట్టే వాళ్ళు, టీవీ లకు అతుక్కొనేవాళ్ళు, క్రికెట్ స్టాటిస్టిక్స్ అన్నీ నోటికి వచ్చినవాళ్ళు. ఇండియా ఆడకున్నా సరే , తెల్లవారుఝామున లేచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా టెస్ట్ మాచ్ లైవ్ చూసేవాళ్ళు….. మన క్రికెట్ ప్రేమికుల గురించి ఎంత చెప్పుకునా తక్కువే. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మన దేశంలో క్రికెట్ ఒక ప్రధాన మతం…పిచ్చి… వ్యసనం… వగైరా వగైరా.

ఇంగ్లిష్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పి క్రికెట్ గురించి వ్యాసం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. “క్రికెట్ కామెంటరి వింటూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు”  అని చెప్పడమే ఈ ‘వ్యాసం’ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. క్రికెట్ కామెంటరి విని ఇంగ్లిష్లో చక్కగా మాట్లాడడం నేర్చుకున్న వాళ్లెందరో ఉన్నారు. ఇంటర్నెట్ అసలే లేని కాలంలో, TV లు కొన్ని ఇళ్లకే పరిమతమైన కాలం లో, రేడియోల్లో కామెంటరి వినడం లో మజా ఎంతుందో 70, 80, దశకాల్లో యువకులుగా ఉన్నవాళ్లనడగండి చెబుతారు. అలాగే, కామెంటరి వినడం కేవలం మజా ఇవ్వడమే కాదు, వాళ్ల ఇంగ్లిష్ ఇంప్రూవ్ కావడానికి ఎంతగా ఉపయోగపడిందో కూడా చెబుతారు.

అప్పటికి ఇప్పటికీ ఎన్నో మార్పులొచ్చాయి. టెస్ట్ మ్యాచులు తక్కువయ్యి వన్డే మ్యాచ్ లు వచ్చాయి. వన్డేలూ తక్కువయ్యి టీ20 లొచ్చాయి. అన్నిటికంటే ముఖ్యంగా, IPL వచ్చింది. IPL తో క్రికెట్ మొత్తం బ్రష్టు పట్టి పోతుందన్న విమర్శలు ఎలా వున్నా, IPL-T20 …….క్రికెట్ పిచ్చిని మరింత పీక్స్ కి తీసుకెళ్ళింది అన్నది నిజం.

క్రికెట్ కామెంటరి తీరు కూడా మారింది. క్వాలిటీ పెరిగింది, మాజీ ప్లేయర్స్ కామెంటేటర్ అవతారం ఎత్తారు. డబ్బులున్నాయి కాబట్టి……. విదేశీ ఆటగాళ్ళు కూడా IPL లో వ్యాఖ్యాతలై పోయారు. మహిళా వ్యాఖ్యాతలూ వచ్చేసరికి, గ్రామర్ కి గ్లామర్ తోడయ్యింది. ఇంతటి ‘ఘన’ చరిత్ర ఉన్న కామెంటరి మన ఇంగ్లిష్ కి ఎలా ఉపయోగ పడుతుందంటే………..

 

  1. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంగ్లిష్ వినడం కంపల్సరి.
  2. ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్న చాలామంది యువకులకు, ముఖ్యంగా, విద్యార్థులకు క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం.
  3. ఆ వినేది మనకిష్టమైంది (=క్రికెట్) కాబట్టి, నేర్చుకోనేది అవకాశాలు ఎక్కువవుతాయి.
  4. కామెంటరి లో వ్యాఖ్యాతలు మాట్లాడే మాటలు తరచుగా రిపీట్ అవుతాయి. సో … ఆ కామన్ ఎక్స్ప్రెషన్స్ మన  తలకెక్కే అవకాశం చాలా ఎక్కువ.
  5. విదేశీ ఆటగాళ్ళ (= native speakars) మాటలు వినడం, మన pronunciation ను, collocations ను ఇంప్రూవ్ చేస్తుంది.

కాబట్టి

  1. ఆట ను ఆస్వాదిస్తూ, మాటలపై కూడా దృష్టి పెట్టండి.
  2. ఒక ఇన్నింగ్స్ అయిపోగానే TV ఆఫ్ చెయ్యకుండా, రెండు ఇన్నింగ్స్ మధ్యలో వచ్చే ‘ ఎక్స్ట్రా ఇన్నింగ్స్ ‘ లాంటి కార్యక్రమాల్ని చూడండి, వినండి.
  3. మ్యాచ్ అయిపోయిన తరువాత జరిగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్  ప్రజెంటేషన్ కార్యక్రమాలను, ఇంటర్వూలను మిస్ కాకండి.
  4. ముందు రోజు చూసిన మ్యాచ్ గురించి , మనం ఎలాగూ మన మిత్రులతో మాట్లాడుకుంటాం. ఆ మాటల్లో మీరు కామెంటరి లో విన్న కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని ఉపయోగించండి.

మీకు ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలన్న ఆసక్తి, క్రికెట్ అంటే ప్రేమ, ఈ రెండూ ఉంటే, క్రికెట్ కామెంటరి వింటూ మీరు బ్రహ్మాండంగా ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పడమే ఈ ‘షాకింగ్’ న్యూస్ ఉద్దేశ్యం.

‘ఇంగ్లిష్ బడి’ మాట నమ్మండి. క్రికెట్ కామెంటరి వింటూ ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేస్కోండి. ముఖ్యంగా ఈ వంద రోజుల IPL (పండగ) సీజన్ లో………

Happy Learning!

 

PS:

  1. మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో పంచుకోండి.
  2. క్రికెట్ కామెంటరీ మీ ఇంగ్లిష్ improvment కి ఆల్రెడీ ఉపయోగపడ్డట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి.
  3. మీకు క్రికెట్ పట్ల ఆసక్తి లేకపోతె, క్రికెట్ అంటే ఇష్టం ఉన్న మీ మిత్రులకి, ముఖ్యంగా విద్యార్థులకి ఈ ఆర్టికల్ ని షేర్ చెయ్యండి. Thanks