ఇంగ్లిష్ ను ఒక స్కిల్ గా నేర్చుకుందాం, ఒక సబ్జెక్ట్ గా కాదు

skill-not-a-subject
Learn English as a SKILL not as a SUBJECT
మనలో చాలా మంది చిన్నప్పట్నుంచి ఇంగ్లిష్ సబ్జెక్టు చదువుకున్నా, మన ఇంగ్లిష్ పరిజ్ఞానం మాత్రం అంతంత మాత్రమే. ఇంగ్లిష్ లో మాట్లాడాలంటే చచ్చేంత భయం. ఇన్ని సంవత్సరాల నుండి ఇంగ్లిష్ నేర్చుకుంటున్నా, ఇంగ్లీష్ భాష మీద మనకు పట్టు రాకపోవడానికి కారణం- ఇన్నిరోజులు మనం ఇంగ్లిష్ ను ఒక సబ్జెక్ట్ గా చూడడమే. మాథ్స్, సైన్స్ లాంటి సబ్జెక్టుల్లా, ఇంగ్లిష్ ని నేర్చుకోవాలని విఫల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఇంగ్లిష్ లో మనకు కేవలం మార్కులొస్తున్నాయి గాని మాట్లాడడం రావట్లేదు 🙁
 
దయచేసి గమనించండి. ఇంగ్లిష్ లో మాట్లాడటం అనేది ఒక స్కిల్. సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం, వంట వండడం, పెయింటింగ్స్ వేయడం, డాన్స్ చేయడం లాగా – ఇంగ్లిష్ లో మాట్లాడటం కూడా ఒక స్కిల్ – ఒక నైపుణ్యం. మిగతా అన్ని స్కిల్స్ ఎలాగైతే నేర్చుకుంటామో, ఇంగ్లిష్ లో మాట్లాడటం కూడా అలాగే నేర్చుకోవాలి.
 
ఉదాహరణకు మనందరికి తెల్సిన స్కిల్ – “ఈత” నే తీసుకుందాం. ఈత రానివాళ్ళు ” ఈత ఎలా నేర్చుకోవాలి?”,  “10 రోజుల్లో ఈత గ్యారంటి” లాంటి పుస్తకాలు చదివితే  ఈత వస్తుందా? చెప్పండి. రాదు కదా? ఈత రావాలంటే నీళ్ళలో దిగాల్సిందే. నీటిలో వుండి, మీరెంత ప్రాక్టిస్ చేస్తే, అంత తొందరగా, అంత బాగా మీకు ఈత వస్తుంది.
 
అలాగే, ఇంగ్లిష్ నేర్చుకోవాలంటే మీ చుట్టూ ఒక ఇంగ్లీష్ ప్రపంచాన్ని నిర్మించుకోవాలి.మీ పరిసరాల్లో ఇంగ్లిష్ ఉండేలా చూడండి. సింపుల్ గా చెప్పాలంటే, ఎక్కువ సమయం మీరు ఇంగ్లీష్ తో గడపాలి.
 
ఇంగ్లిష్ తో టైం గడపడమేంటి బాస్, ఇంకొంచెం సింపుల్ గా, straight forward; చెప్పాలంటారా, సరే, వినండి.
 
కింద చెప్పిన నాలుగు పనులు , ప్రతిరోజూ, తప్పనిసరిగా చెయ్యండి.
1. ఇంగ్లీష్ వినండి.
2. ఇంగ్లిష్ చదవండి
3. ఇంగ్లిష్ లో మాట్లాడండి
4. ఇంగ్లిష్ లో రాయండి.
 
అంతే……… ఏ భాష నేర్చుకోవాలన్నా చెయ్యాల్సిన పనులు ఇవే. ఈ నాలుగు పనుల్ని లాంగ్వేజ్ స్కిల్స్ అంటారు. ( LSRW – Listening, Speaking, Reading and Writing ). ఏం వినాలి, ఏం చదవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి , ఎలా రాయాలి అన్న విషయాలు తరువాత మాట్లాడుకుందాం.
 
కాని, ఇప్పటికి మాత్రం, LSRW మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా చేస్తేనే ఇంగ్లిష్ వస్తుంది, ఇలా చేస్తేనే ఇంగ్లిష్ లో మాట్లాడడం నేర్చుకోవచ్చు, ఇలా చేయకపోతే, ఇంగ్లిష్ నేర్చుకోవడం, ఇంగ్లిష్ లో మాట్లాడడం ఎప్పటికి సాధ్యం కాదు అన్న చిన్న లాజిక్ మాత్రం మిస్ కాకండి.

7 Comments

  1. Chadavatam,,Rayadam,,vinnadi,ardam,chesukotam,varaku,okey,tirigi matladatam,,kastam,naaku,

    1. Author

      కొత్తలో అందరికి అలాగే ఉంటుందండి. కొంచెం ఇంగ్లిష్ వాతావరణాన్ని సృష్టించుకొని మెల్లి మెల్లిగా మాట్లాడటం మొదలుపెట్టండి, మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. Thanks for visiting EnglishBadi. Please come regularly. Happy learning!

      1. Good evening sir thanks for so much encouraging for students

        1. Sir please create a mobile app

      2. Sir please create a mobile app…….

  2. Thanku ….

Comments are closed.