Collocations అంటే ఏంటి? అవి నేర్చుకోవడం అవసరమా?

take-collocationsCollocations అంటే ఏంటి?

Collocations are a group of words that are commonly used together.

Collocation అంటే రెండు లేదా మూడు పదాల combination. ఇదే కాంబినేషన్ తరచుగా ఉపయోగించబడుతుంది. మీరు సరైన Collocations వాడితేనే మీ ఇంగ్లిష్ సహజంగా అనిపిస్తుంది, వినిపిస్తుంది.

ఉదాహరణకు, “చిన్న గా ఉండే జుట్టు” ను ‘short hair’ అంటే బాగుంటుంది. అదే, ‘small hair’ అంటే అసహజంగా ఉంటుంది.

తొందరగా తినే/ తయారు చేయబడే  ఆహారాన్ని ‘fast food’ అంటాం కాని ‘quick food’ అనము.

‘short hair’ ‘fast food’  లాంటి  పదాల కాంబినేషన్స్ నే Collocations అంటారు.

మరిన్ని ఉదాహరణలు:

strong wind – heavy wind
heavy rain – strong rain

quick shower- fast shower

Collocations  ఎందుకు నేర్చుకోవాలి?

మీరు wrong collocations use చేస్తూ  ‘quick food’, ‘strong rain’ లాంటి ఎక్స్ప్రెషన్స్ వాడుతూ మాట్లాడితే వినేవాల్లకి మీరేం చెప్పాలనుకుంటున్నారో అర్థం కావచ్చేమో కాని మీ ఇంగ్లిష్ అంత బాగా లేదు అన్న విషయం ఈజీగా తెలిసిపోతుంది.

అన్ని భాషల్లో లాగానే, ఇంగ్లిష్ లో కూడా అసంఖ్యాకమైన Collocations ఉన్నాయి. ఆవన్నీ నేర్చుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. అయితే, రోజువారీ అవసరాల్లో ఉపయోగించే Collocations ని నేర్చుకొని, వాటిని ఎంత ఎక్కువగా వాడితే మీ ఇంగ్లిష్ అంత బాగుంటుంది.

Collocations నేర్చుకుంటే:

  • మీరు చాలా కొత్త కొత్త ఇంగ్లిష్ పదాల్ని, ఎక్స్ప్రెషన్స్ ని  తొందరగా, సులభంగా నేర్చుకోగలుగుతారు.
  • మీ ఇంగ్లిష్ సహజంగా, రిచ్ గా ఉంటుంది. అందరికి ఈజీగా అర్థం అవుతుంది

Collocations ఎలా నేర్చుకోవాలి?

  • చదవండి. వీలైనంత ఎక్కువగా చదవండి. మనం చదివే కథల్లో, వ్యాసాల్లో, వార్తల్లో తరచుగా, సందర్భానుసారంగా వాడే Collocations ని గమనించండి. వీలైతే ఏదైనా నోట్ బుక్ లో రాసుకోండి.
  • Collocation రెండు అంత కంటే ఎక్కువ పదాలతో ఉన్నా కూడా, ఒక Collocation ని ఒకే పదం గా పరిగణించండి. ఉదాహరణకు, ‘highly dangerous’ అన్న Collocation ని ఒకే పదం గా నేర్చుకోండి. రెండు వేర్వేరు పదాల్లా కాదు   highly    dangerous.
  • ఏదైనా కొత్త పదం నేర్చుకోనేప్పుడు, అ పదం తో వాడబడే Collocations తో సహా నేర్చుకోండి. ఉదాహరణకి, ‘contribute’ అనే పదం నేర్చుకోనేప్పుడు, ఈ కింది Collocations ని కూడా నేర్చుకోండి.

contribute enormously,
contribute generously,
contribute greatly,
contribute handsomely,
contribute heavily,
contribute substantially

  • సమయం దొరికినప్పుడల్లా మీరు రాసుకున్నవి, నేర్చుకున్నవి నెమరు వేసుకోండి. సందర్భం దొరికినప్పుడు వాటిని  వాడడానికి ప్రయత్నం చెయ్యండి.
  • Collocations గురించి సమాచారం అన్ని స్టాండర్డ్ డిక్షనరిలలో ఉంటుంది. ప్రత్యేకంగా Collocations డిక్షనరీలు కూడా ప్రస్తుతం మార్కెట్లో/ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

ఏమంటారు? Collocations నేర్చుకోవడం అవసరమే అంటారా? సరే, మనం కలిసి ‘Collocations’ నేర్చుకుందాం. ఇంగ్లిష్ బడి మీక్కొన్ని Collocations అందిస్తుంది. మీరు కూడా Collocations కలెక్ట్ చెయ్యడం, ప్రాక్టిస్ చెయ్యడం ప్రారంభించండి. Happy Learning!!