
Welcome to English Badi
మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? సంతోషం. చాలా మంది ఇంగ్లిష్ నేర్చుకోవాలని కేవలం ‘అనుకుంటారు’, ‘అనుకుంటూనే ‘ ఉంటారు. కాని కొంతమంది మాత్రమే ఇంగ్లిష్ నేర్చుకోవడానికి ఏమన్నా ‘చేస్తుంటారు’. ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న బలమైన కోరిక ఉండి, దానికోసం కష్టపడడానికి సిద్దంగా ఉన్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ వెల్ కం టు ఇంగ్లిష్ బడి !!! మీలాంటి వాళ్ళ కోసమే ఈ “ఇంగ్లిష్ బడి”. ఇంగ్లిష్ లో చక్కగా, ధైర్యంగా, ఎవ్వరితోనైనా, ఎక్కడైనా మాట్లాడగలిగే స్థాయికి చేరాలన్న మీ లక్ష్యసాధనలో మీకు సహాయపడటమే “ఇంగ్లిష్ బడి” ప్రధాన ఉద్దేశ్యం.
మీరు చెయ్యాల్సిందల్లా:
- రెగ్యులర్ గా “ఇంగ్లిష్ బడి” కి రండి.
- ప్రతిరోజూ ఒక గంట ఈ ఇంగ్లీష్ బడి లో గడపడానికి ప్రయత్నం చెయ్యండి. వీలుకాకపోతే కనీసం అర్థగంట అయినా పరవాలేదు.
- స్టెప్ బై స్టెప్ నేర్చుకునే ప్రయత్నం చెయ్యండి. అంతా ఒకేసారి చదివేయకండి. రోజుకొకటో, రెండో పోస్టింగ్స్ చదివి, నాలుగైదు కొత్త విషయాలు తెలుసుకుంటే చాలు.
- అత్యంత ముఖ్యమైన విషయం – నేర్చుకున్న వాటిని ప్రాక్టిస్ చెయ్యండి.
ఇంగ్లిష్ బడి మిమ్మల్ని కోరేదేంటంటే:
- సాద్యమైనంత ఎక్కువమందికి లాభం చేకూర్చడమే “ఇంగ్లిష్ బడి” లక్ష్యం. సో, ఇంగ్లిష్ బడి మీకు నచ్చి, ఉపయోగకరంగా ఉన్నట్లయితే, దయచేసి, ‘ఇంగ్లిష్ బడి’ ని మీ ఫ్రెండ్స్ కి, మీ సర్కిల్ లో ఇంగ్లిష్ నేర్చుకోవాలను కుంటున్న వాళ్లకి పరిచయం చెయ్యండి.
- ఇంగ్లిష్ బడి రెగ్యులర్ updates/tips కోసం మా facebook, twitter పేజి లను LIKE చెయ్యండి.
- కామెంట్స్ ద్వారా, ఈ మెయిల్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని, సలహాల్ని మాతో పంచుకోండి. మా ఈ మెయిల్ ID – englishbadi@gmail.com
- ఇడి చాలా కొద్ది మంది ఔత్సాహికులు చేస్తున్న ప్రయత్నం ఇది. మీ మెయిల్స్ కి రిప్లై రాయడం లేట్ అయితే తప్పుగా భావించకండి. అలాగే, సైట్ లో అక్కడక్కడ ఏదైనా తప్పులు కనిపిస్తే ( ముఖ్యంగా తెలుగు స్పెల్లింగ్ మిస్టేక్స్ ) క్షమించండి. తప్పులు కొంచెం పెద్దవైతే, వాటిని మా దృష్టి కి తీసుకురండి.
ఇంగ్లిష్ పై పట్టు సాధించాలి అన్న తపన, నేర్చుకోవడానికి కావాల్సిన మోటివేషన్ మీకుంటే చాలు. మీకు సహాయ పాడాలన్న చిత్తశుద్ధి మాకుంది. సో, లెట్స్ స్టార్ట్ ది జర్నీ. బెస్ట్ అఫ్ లక్!